శ్రీరామ బంటుణ్ణి మా రాజు సుగ్రీవులూ
అంగదుడు నా పేరు మా తండ్రి వాలిరా వోరీ
రావడా మా తండ్రి వాలిరా వోరీ
బలశాలి వాలికి సెడ బుట్టి నావురా
పగవాని కొలువులో బానిసల బతుకేల ఓరీ
వనచరీ బానిసల బతుకేల ఓరీ
జగము పాలించేటి జగదీశ్వరుడు
మాపాలి పరమాత్మ పగవాడు గాదురా ఓరీ
రావణా పగవాడు గాదురా ఓరీ
యెక్క గుర్రాలిస్తు యేనుగలనిస్తురా
యేల ఋూమూలిస్తు యెలనాగ లిస్తురా ఓరీ
వసచరీ యెల నాగలిస్తురా ఓరీ
కోటాన కోట్లుగా కోటి దండు దళము
కోదండ రాములూ కదిలివాస్తారు ఓరీ
రావణా కదిలివొస్తా రోరీ
నల్ల జీమల్లట్ల నరుల సలిపేపిస్తు
కోతిమూళల జంపి గోరీలు కట్టిస్తురా ఓరి
వనచరీ గోరీలు కట్టిస్తురా ఓరీ